ETV Bharat / offbeat

కూరల్లోకి ఇలా "ఉల్లి పొడి"ని ప్రిపేర్ చేసుకున్నారంటే - తరచూ ఆనియన్స్ కొనాల్సిన అవసరం ఉండదు! - ONION POWDER RECIPE

కూరలకు అదనపు టేస్ట్​నిచ్చే ఉల్లి పొడి - సింపుల్​గా ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోండిలా!

HOMEMADE ONION POWDER
Onion Powder Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 7:01 PM IST

Onion Powder Recipe in Telugu : మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఆనియన్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. కూర, పప్పు, చారు ఇలా ప్రతి కూరలో రుచికోసం ఉల్లిని తప్పనిసరిగా వేస్తాం. ఇక పచ్చిపులుసు, ఆనియన్‌ దోశల ఘుమాయింపంతా ఉల్లిలోనే ఉంటుంది. అది వేయడం వల్లే కూరలకు గ్రేవీ వస్తుంది. అయితే, కూరలు, స్నాక్స్ ఇలా ఏవైనా సరే ఎప్పుడూ రొటీన్​ టేస్ట్​తో ఉంటే ఎవరికైనా నచ్చవు. వాటినే ఎప్పటికప్పుడు కొత్తగా, మరింత టేస్టీగా చేసుకునేందుకు ప్రస్తుతం రకరకాల పౌడర్స్ మార్కెట్​లో దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఉల్లి పొడి.

కొన్ని రెసిపీలలో మీరు తరచుగా వాడే ఉల్లిపాయ తరుగు కంటే ఈ ఆనియన్ పొడిని వాడడం అదనపు రుచిని అందిస్తుంది. అయితే, ఎక్కువ ఖరీదు చెల్లించి రసాయనాలు కలిపిన పౌడర్​ను బయట నుంచి కొనితెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఈవిధంగా ఇంట్లోనే నేచురల్​గా చేసుకోవడం ద్వారా డబ్బు ఆదాతో పాటు రుచి, శుచిగానూ ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉల్లి ధర ఎక్కువగా ఉంది. కాబట్టి ఓసారి ఇలా పొడి చేసుకుని పెట్టుకున్నారంటే తరచూ ఉల్లిగడ్డలు కొనకుండా చాలా రోజులు వివిధ కర్రీలలో యూజ్ చేసుకోవచ్చు. పైగా కర్రీలు మంచి టేస్టీగా ఉంటాయట. మరి, వంటకాలకు సరికొత్త టేస్ట్​ని అందించే ఈ ఉల్లి పొడిని ఇంట్లోనే సింపుల్​గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడైనా "ఆనియన్​ చపాతీ" తిన్నారా? - బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​కు సూపర్ ఛాయిస్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కిలో ఫ్రెష్​గా ఉండే ఉల్లిపాయలను తీసుకోవాలి. ఆపై వాటిని పొట్టు తీసి శుభ్రంగా కడగాలి.
  • ఆ తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదు అంటే వెజిటబుల్ స్లైసర్​తో చిన్న చిన్న స్లైసెస్​గా చేసుకోవాలి.
  • అనంతరం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కనీసం 4 నుంచి 5 రోజులు బాగా ఎండబెట్టాలి.
  • ఒకవేళ మీరు చల్లని ప్రదేశంలో ఉంటే ఓవెన్​లో 60-70 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేయొచ్చు.
  • ఉల్లిపాయ ముక్కలు బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్​లో వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
  • ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పౌడర్​ను తడిలేని సీసాలో స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడు వివిధ వంటకాలలో వాడుకోవచ్చు.
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఇలా ఉల్లి పొడిని ప్రిపేర్ చేసుకొని వంటలలో వాడి చూడండి. సరికొత్త టేస్ట్​ని పొందుతారు!

ఓసారి ఇలా "ఉల్లిపాయ టమటా పచ్చడి" చేయండి - అన్నం, టిఫెన్స్ దేనిలోకైనా అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.