ETV Bharat / entertainment

ప్రమాదానికి గురైన హీరో అజిత్‌ కారు - ​ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం! - AJITH CAR ACCIDENT

దుబాయ్​లో ప్రమాదానికి గురైన అజిత్‌ కారు - ఏమైందంటే?

Ajith Car Accident
Ajith (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 7:04 PM IST

Ajith Car Accident : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. దుబాయ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, రేస్​ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్రాక్ పై గిర్రున తిరిగి ముందు భాగం డ్యామేజ్‌ అయింది. భద్రత సిబ్బంది తక్షణమే స్పందించి ఆయన వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత తనను వేరే కారులో తరలించారు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డప్పటికీ అజిత్‌కు స్వల్పంగా గాయమైనట్టు తెలుస్తోంది.

కొత్త రేసింగ్ టీమ్!
అయితే అజిత్​కు రేసింగ్‌ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగుల నుంచి బ్రేక్‌ దొరికితే చాలు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి మిగతా సమయాన్ని బైక్స్‌, కార్లతో చక్కర్లు కొడుతుంటూ కనిపిస్తుంటారు. కొన్ని నెలల క్రితం గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్‌ చేశారు. ఆ వీడియో అప్పట్లోనే తెగ వైరల్‌ అయింది. మోటార్‌ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కూడా అజిత్‌ ఓ స్టార్టప్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకూ బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే కాకుండా తాజాగా తన రేసింగ్‌ టీమ్‌ను ప్రకటించారు. 'అజిత్‌ కుమార్ రేసింగ్‌' అనే పేరుతో టీమ్‌ను ఓ టీమ్​ను ఏర్పాటు చేసినట్లు అజిత్‌ మేనేజర్‌ సురేశ్‌ చంద్ర తాజాగా వెల్లడించారు.

ఇక అజిత్ అప్​కమింగ్ మూవీస్​ విషయానికి వస్తే, ఆయన 62వ చిత్రంగా రూపొందిన 'విడా ముయార్చి' ఈ సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్​ను పోస్ట్​పోన్ చేశారు మేకర్స్​. మగిల్​ తిరుమేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అజిత్‌ సరసన త్రిష నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇది కాకుండా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' అనే ద్విభాష చిత్రంలోనూ నటిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ డైరెక్షన్​లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్స్​లో అజిత్ న్యూ లుక్​లో కనిపించి అభిమానులను అలరించారు.

'దయచేసి నన్ను అలా పిలవొద్దు- చాలా ఇబ్బందిగా ఉంది'- ఫ్యాన్స్​కు అజిత్ ఓపెన్ లెటర్

రూ.4 కోట్లతో మరో లగ్జరీ కార్​ కొన్న స్టార్ హీరో - ఆయన భార్య కామెంట్స్​ వైరల్​! - Ajith Kumar Buys New Car

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.