Captains Who Scored Centuries In All Three Formats : ఏ క్రికెటర్‌కైనా దేశానికి సారథ్యం వహించడం పెద్ద సవాల్‌తో కూడుకున్న పని. అయితే ఓ సారి కెప్టెన్ అయ్యాక మరింత ఒత్తిడికి లోనై సరిగ్గా పెర్ఫామ్ చేయలేని సందర్భాలను చవిచూస్తుంటారు. కానీ ఆ స్ట్రెస్‌ను తట్టుకుని రాణించిన క్రికెటర్లూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కోవలోకి టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ వస్తారు.
తమ జట్లకు సారథ్య బాధ్యతలను చేపడుతూనే ఈ ఇద్దరూ తమ కెరీర్లో 41 సెంచరీలు బాదారు. అయితే అవన్నీ వన్డే, టెస్టుల్లో మాత్రమే. టీ20ల్లో కెప్టెన్‌గా ఉండి సెంచరీ చేయలేకపోయారు. కానీ కెప్టెన్లుగా ఉండి మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్లు ఉన్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఓ లుక్కేద్దాం పదండి.
తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)
మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన కెప్టెన్లలో శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ ఒకరు. తాను కెప్టెన్‌గా వ్యవహరించిన 5వ వన్డే, 3వ టీ20, మూడో టెస్టు మ్యాచ్‌లో శతకాలు నమోదు చేశాడు. ఇంగ్లాండ్ పై జరిగిన టెస్టులో దిల్షాన్ కెప్టెన్‌గానే 193 పరుగులు చేశాడు. హరారే వేదికగా జింబాబ్వేతో 2010లో జరిగిన వన్డేలో 108 రన్స్ పరుగులు నమోదు చేశాడు. 2011లో పల్లెకెలె వేదికగా ఆసీస్‌తో జరిగిన టీ20లో 57 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా దిల్షాన్ తన కెరీర్లో టెస్టుల్లో 16, వన్డేల్లో 22, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా)
కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచాడు. కెప్టెన్‌గా టెస్టు, వన్డేల్లో చెరో 5, టీ20ల్లో ఒక సెంచరీ బాదాడు. ఓవరాల్‌గా కెప్టెన్‌గా డుప్లెసిస్ 11 శతకాలు నమోదు చేశాడు. 2016లో కివీస్ తో జరిగిన టెస్టులో కెప్టెన్‌గా డుప్లెసిస్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు.
ఇక 2016 అక్టోబరులో జోహన్నెస్ బర్గ్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో 111 పరుగులు చేశాడు. 2015లో విండీస్‌తో జరిగిన టీ20లో 119 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా డుప్లెసిస్ తన కెరీర్లో టెస్టులో 10, వన్డేల్లో 12, టీ20ల్లో ఒక శతకం చేశాడు.
బాబర్ ఆజామ్
2015లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ అనతికాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక పాక్ కెప్టెన్ కూడా బాబర్ ఆజామే కావడం విశేషం. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో బాబర్ మొత్తం 15 సెంచరీలు చేశాడు. టీ20ల్లో 3, వన్డేల్లో 8, టెస్టుల్లో 4 శతకాలు నమోదు చేశాడు. కెప్టెన్‌గా బాబర్ తొలి వన్డే సెంచరీని (125 పరుగులు) 2019లో జింబాబ్వేపై చేశాడు. దక్షిణాఫ్రికాపై టీ20ల్లో సెంచరీ బాదాడు. అలాగే ఓవరాల్‌గా బాబర్ తన కెరీర్లో టెస్టుల్లో 9, వన్డేల్లో 19, టీ20ల్లో 3 సెంచరీలు సాధించాడు
రోహిత్ శర్మ
కెప్టన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ రోహిత్ శర్మ. బాబర్ ఆజామ్, తిలకరత్నే దిల్షాన్, డుప్లెసిస్ తర్వాత అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగానూ హిట్‌మ్యాన్ రికార్డుకెక్కాడు. అయితే కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్ టీ20ల్లో 3, టెస్టుల్లో 4, వన్డేల్లో 4 సెంచరీలు సహా మొత్తం 11 శతకాలు బాదాడు. అంతేకాకుండా తన కెరీర్లో టెస్టుల్లో 12 సెంచరీలు, వన్డేల్లో 31 సెంచరీలు, టీ20ల్లో 4 సెంచరీలు సాధించాడు.
33 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 - తన రికార్డునే బ్రేక్ చేసిన పంత్!
46 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా - ఆ స్పిన్ దిగ్గజం తర్వాత మనోడిదే ఘనత!