తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పడవ బోల్తా- సినిమా లెవెల్లో రెస్క్యూ చేసిన జంట- 21మంది ప్రాణాలు సేఫ్! - Asaam Couple Saves 21 Lifes

Asaam Couple Saves 21 Lifes: భారీ వరదలతో అటలాకుతలమైన అసోంలో ఓ వీరోచిత జంట కథ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. సకాలంలో తెగువ చూపిన ఈ జంట ఏకంగా 21 మంది ప్రాణాలు కాపాడింది.

Assam Boat Accident
Assam Boat Accident (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 5:21 PM IST

Asaam Couple Saves 21 Lifes :భారీ వరదలతో అసోం అతలాకుతలమైంది. వందమందికిపైగా వరదల ప్రభావంగా కన్నుమూశారు. అయితే అసోంలో ఓ వీరోచిత జంట కథ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఆ జంట ప్రదర్శించిన ధైర్య సాహసాలను దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు. ఈ జంట సకాలంలో స్పందించకపోతే వరదల్లో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగేది. ఇంతకీ ఎవరా జంటా? ఎందుకు అసోంలో వారి గురించే చర్చ జరుగుతుందో చూద్దాం

చిన్న పడవలో పెద్ద సాహసం
అసోంలోని గోల్‌పరాలో షాజహాన్ అలీ జంట నివసిస్తోంది. అతడి భార్య పేరు సాహిదా ఖాతున్. షాజహాన్ అలీ-సాహిదా ఖాతున్ దంపతులు తమ ఇంటి సమీపంలోని కాలువలు, చెరువుల్లో చేపలు పట్టి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే జులై 11వ తేదీన ఈ జంట ఎందరో ప్రాణాలను రక్షించి స్ఫూర్తిగా నిలిచింది. జులై11వ తేదీన అసోంలోని గోల్‌పరా సిమ్లిటోల్లా గ్రామంలో భారీ వరదలు సంభవించాయి. ఆ సమయంలో అంత్యక్రియలకు హాజరై ఇంటికి వెళ్లేందుకు 26 మంది బృందం పడవలో బయలుదేరింది.

అయితే వరద ఉద్ధృతి పెరగడం వల్ల 26మందితో వెళ్తున్న పడవ నదిలో తిరగబడింది. దీంతో మొత్తం 26మంది నీటిలో పడిపోయారు. ఆ సమయంలో రక్షించాలంటూ వారు చేసిన ఆర్తనాదాలు సాహిదా ఖాతున్- షాజహాన్ అలీ దంపతులకు వినపడ్డాయి. దీంతో క్షణం కూడా ఆలోచించకుండా తాము చేపలు పట్టే చిన్న పడవలో వారి దగ్గరకి చేరుకున్నారు. 26మంది ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సహాయం చేశారు. నీటిలో మునిగిపోతున్న కొందరిని ఆ పడవ సాయంతో ఎలాగోలా ఒడ్డుకు చేర్చగలిగారు. బోల్తా పడ్డ పడవను మళ్లీ సరిచేసి ఈ చిన్న పడవతో ఆ పెద్ద పడవను లాక్కుంటూ ఒడ్డుకు చేర్చారు.

ఇలా సాహిదా ఖాతున్ ఆమె భర్త షాజహాన్ అలీ మొత్తం 21 మందిని రక్షించారు. కానీ, అప్పటికే నీటిలో పడి నలుగురు మరణించారు. ఆ నలుగురు మృతదేహాలను కూడా షాజహాన్‌ అలీ ఆ నది నుంచి బయటకు తీశారు. ఒకరి ఆచూకీ మాత్రం గల్లంతైంది. ఆ మృతదేహం కొన్ని రోజుల తర్వాత లభించింది. ఈ ఘటనతో సిమ్లిటోలా గ్రామం శోకంసంద్రంలో మునిగిపోయింది.

ధైర్యసాహసాలకు సలాం
ఈ పడవ ప్రమాదంలో మొత్తం 21 మందిని కాపాడిని సాహిదా ఖాతున్‌ దంపతులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారు కాస్త ఆలస్యం చేసినా మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని చర్చించుకుంటున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలు 21 కుటుంబాల్లో వెలుగులు నింపాయని కొనియాడుతున్నారు.

పడవ బోల్తా పడి 80మందికి పైగా మృతి- ఇంజిన్ ఫెయిల్యూర్​ వల్లే!

బ్రహ్మపుత్ర ఉగ్రరూపం- వరదలకు అసోం అతలాకుతలం- 24లక్షల మందికిపైగా! - Assam Floods 2024

ABOUT THE AUTHOR

...view details