గుండెపోటుతో రెజ్లర్ మృతి.. వాకింగ్ చేసి వస్తుండగా అక్కడికక్కడే.. - రెజ్లర్ మృతి
🎬 Watch Now: Feature Video
వాకింగ్ చేసి వస్తుండగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ఓ యువ రెజ్లర్ మృతి చెందిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. బెళగావి జిల్లాకు చెందిన యువ రెజ్లర్ పైల్వాన్ సంగప్ప(28).. ధార్వాడ్లో స్థిరపడ్డాడు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ ముగించుకుని తన స్నేహితుడితో ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో గుండెపోటు వచ్చి రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. అయితే అక్కడికక్కడే పైల్వాన్ మరణించాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. పైల్వాన్ సంగప్ప మరణంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.