భారీ వర్షాలు.. వీధుల్లో నురగలు కక్కుతున్న వరద నీరు.. ప్రజల అవస్థలు! - chemical water on roads in gujarat
🎬 Watch Now: Feature Video
Chemical Water On Road: గుజరాత్లో నాలుగు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్ నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగర వీధుల్లోకి చేరిన వరద నీరు నురగలు కక్కుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. చెడు వాసనతో అవస్థలు పడుతున్నారు. సమీపంలో ఉన్న సరస్పుర్ టెక్స్టైల్ మిల్లు వ్యర్థ జలాలే రోడ్లపైకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మిల్లు యాజమాన్యం కనీస జాగ్రత్తలు పాటించట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.