జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..? - జమ్ముకశ్మీర్
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్లో సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చాయి. శుక్రవారం సంజవాలో జరిగిన ఈ ఘటనలో ఒక సైనికుడు వీరమరణం పొందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. కశ్మీర్లో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించనున్నారు. దానికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు పుల్వామా తరహాదాడికి ప్రయత్నిచడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.