చిన్నారిపై సవతి తల్లి కర్కశం.. అన్నం అడిగితే సీలింగ్‌కు వేలాడదీసి.. - మందసౌర్ న్యూస్
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ మందసౌర్‌లో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికను కొడుతూ సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసింది. బాలికను కొడుతున్న దృశ్యాలను ఓ స్థానికుడు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు బాలికను సంరక్షణ గృహానికి తరలించారు. తనకు అన్నం కూడా సరిగ్గా పెట్టదని.. అడిగితే సీలింగ్‌కు కట్టి వేలాడేస్తుందని.. పాఠశాలకు పంపదని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.