లంకలో ఆగ్రహజ్వాల.. ప్రధాని ఆఫీస్‌లోకి ఆందోళనకారులు.. రాజీనామాకు డిమాండ్! - శ్రీలంక వార్తలు లేటెస్ట్
🎬 Watch Now: Feature Video
Srilanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కొలంబోలోని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయంలోకి నిరసనకారులు ప్రవేశించారు. బుధవారం ఉదయం ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి.. ప్రధాని కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వారిని చెదరగొట్టేందుకు లంక పోలీసులు బాష్పవాయువును ప్రయెగించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ప్రధాని కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు.