ETV Bharat / health

ఈ పొక్కులకు కారణం వైరస్ - ఒక్కసారి సోకితే అంతేనట! - ఏం చేయాలంటే - FEVER BLISTERS CAUSES AND SYMPTOMS

-వయసుతో సంబంధం లేకుండా "ఫీవర్​ బ్లిస్టర్స్​" -ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు

Fever Blisters Causes and Symptoms
Fever Blisters Causes and Symptoms (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Fever Blisters Causes and Symptoms: చాలా మందికి పెదవుల చుట్టూ లేదా అంచుల మీద నీటి పొక్కుల మాదిరిగా చిన్న చిన్న దద్దుర్లు ఏర్పుడుతుంటాయి. ఇలా వస్తే వేడి చేసిందని కొద్దిమంది, బల్లి మూత్రం పడిందని మరికొద్దిమంది అంటుంటారు. కానీ.. ఇలా పెదవుల చుట్టూ పొక్కులు ఏర్పడటానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు నిపుణులు. ఈ సమస్య వైరస్ వల్ల వస్తుందని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు సంబంధించిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డెంటల్​ అండ్​ క్రానియోఫేషియల్ రీసెర్చ్​ ప్రచురించింది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). ఇంతకీ ఏంటా వైరస్​? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కారణాలు: పెదవుల చుట్టూ వచ్చే నీటి పొక్కులను ఫీవర్ బ్లిస్టర్స్ అంటారు. వీటినే కోల్డ్​ సోర్స్​ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రధానంగా ''హెర్పీస్ సింప్లెక్ష్ వైరస్​ -HSV​ వలన వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, జీవితాంతం శరీరంలోనే ఉంటుందని.. రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు బయటపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఒత్తిడి, హార్మోన్స్​ అసమతుల్యత వంటి కారణాల వల్ల ఈ వైరస్ మళ్లీ చురుకుగా మారి.. పెదవుల చుట్టూ పొక్కులు వస్తాయని అంటున్నారు.

లక్షణాలు: ఈ సమస్య ఉన్న అందరిలో ఒకే విధమైన లక్షణాలు కనిపించవని.. మనిషి మనిషికీ మారుతుంటాయని అంటున్నారు. కొంతమందికి తీవ్రమైన లక్షణాలు ఉండగా, మరికొంతమందికి తక్కువ తీవ్రతతో కూడిన లక్షణాలు ఉంటాయంటున్నారు. ఆ లక్షణాలు చూస్తే..

  • ఈ పొక్కులు పెదాలు, గడ్డం, బుగ్గలు, ముక్కుకు దగ్గరలో కనబడుతుంటాయి.
  • ఈ పొక్కులు ఉన్న ప్రదేశంలో ఉన్నవారిలో నొప్పి, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • అలాగే కొన్నిసార్లు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, లింప్ నోడ్స్ లో వాపు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • పొక్కులు ఉన్న చోట నొప్పి వల్ల తినడం, తాగడం కష్టంగా ఉంటుంది.
  • కొన్ని సందర్భాల్లో చెంపలు, ముక్కు లోపల కూడా ఫీవర్​ బ్లిస్టర్స్​ రావచ్చు.

చికిత్స: సాధారణంగా ఈ ఫీవర్​ బ్లిస్టర్స్​ ఒకటి నుంచి రెండు వారాల్లో వాతంతట అవే తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఎక్కువకాలం ఉంటే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని అంటన్నారు. అంతేకాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

  • సాధారణంగా ఫీవర్​ బ్లిస్టర్స్​ అనేది అంటువ్యాధి. ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉన్నందున.. ముద్దులు పెట్టుకోవడం, తినే పాత్రలు, కప్పులు, నీటి సీసాలు లేదా ఇతర వస్తువులను వేరేవారితో పంచుకోవడం మానుకోవాలంటున్నారు. చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
  • అలాగే ఆ పొక్కులను చేతితో తాకకూడదని సూచిస్తున్నారు.
  • చేతితో తాకి అదే చేతితో చర్మంపై వేరే ప్రదేశాల్లో ముట్టుకోవడం వల్ల అక్కడ కూడా వ్యాపిస్తాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చంకలో ఎర్రటి దద్దుర్లు ఇబ్బందిపెడుతున్నాయా? - అయితే కారణాలు ఇవే!

చలికాలంలో చర్మ సమస్యలా? ఇది పెట్టుకుంటే అన్నీ మాయం! మీరు ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.