పట్టపగలే చోరి.. బైక్‌పై వచ్చి రూ.28 లక్షలు లాక్కెళ్లిన దుండగులు - సూరత్‌లో దోపిడీ
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సూరత్‌లోని ఉధనా ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి రూ.28 లక్షలు ఉన్న బ్యాగును కొట్టేశారు నిందితులు. ఫైనాన్స్ సంస్థకు చెందిన జగదీశ్ చోక్సీ.. బుధవారం పలువురి నుంచి డబ్బును వసూలు చేసుకుని బైక్‌పైన ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ముగ్గురు నిందితులు.. జగదీశ్ వద్ద ఉన్న బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. ప్రతిఘటించేందుకు యత్నించిన జగదీశ్ బైక్ నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.