ETV Bharat / offbeat

సేమియాతో పాయసం, ఉప్మానే కాదు - ఇలా "బొబ్బట్లు" చేసుకోండి! - రుచి అమృతమే! - SEMIYA BOBBATLU RECIPE

మీకు తీపి పదార్థాలు అంటే ఇష్టమా? - ఓసారి ఇలా 'సేమియా బొబ్బట్లు' ట్రై చేయండి!

HOW TO MAKE SEMIYA BOBBATLU
Semiya Bobbatlu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

Semiya Bobbatlu Recipe in Telugu : చాలా మందికి ఇష్టమైన స్వీట్ రెసిపీలలో ఒకటి బొబ్బట్లు. వీటినే ప్రాంతాన్ని బట్టి భక్ష్యాలు, ఒబ్బట్టు, పూరన్​పోలీ, పోలె.. అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది పండగలు, పూజలు, ప్రత్యేక వేడుకల సమయంలో ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుని ఆస్వాదిస్తుంటారు. అయితే, ఈ బొబ్బట్లను ఎక్కువగా శనగపప్పు/పెసరపప్పు వంటి వాటితోనే చేస్తుంటారు. అలాకాకుండా ఈసారి కాస్త వెరైటీగా "సేమియాతో బొబ్బట్లను" ట్రై చేయండి. ఇవి మామూలు బొబ్బట్ల కంటే చాలా రుచికరంగా ఉంటాయి! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సేమియా - 1 కప్పు
  • గోధుమపిండి - 1 కప్పు
  • చక్కెర - ముప్పావు కప్పు
  • ఆయిల్ - 2 స్పూన్లు
  • కొబ్బరి తురుము - ముప్పావు కప్పు
  • నెయ్యి - తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బాదం - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - 2 టేబుల్​స్పూన్లు
  • యాలకుల పొడి - అర చెంచా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో గోధుమపిండి, ఉప్పు, నూనెతో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం, జీడిపప్పు పలుకులను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక సేమియాను వేసుకొని లేత గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత అదే కడాయిలో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా, పంచదార వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక మంట తగ్గించి అందులో కొబ్బరి తురుము, మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పుల పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై నిమిషం తర్వాత స్టౌను ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం సేమియా మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్​లా చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. తర్వాత చపాతీ పీటపై ఒక్కో ఉండను ఉంచి చపాతీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. ఆపై దాని మధ్యలో ముందుగా చేసుకున్న చిన్న సేమియా ముద్దను ఉంచి సైడ్స్ మూసేసి నెమ్మదిగా మరోసారి వీలైనంత పల్చగా వత్తుకోవాలి.
  • ఆవిధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌపై పెనం పెట్టుకొని నేతితో రెండువైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా బొబ్బట్లు రెడీ!
  • ఇక వీటి మీద కాస్త నెయ్యి అప్లై చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది. అలాగే, ఒకవేళ మీరు పంచదార వద్దనుకుంటే బెల్లం వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా సేమియా బొబ్బట్లు ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా చాలా ఇష్టంగా తింటారు!

ఇవీ చదవండి :

అన్నం మిగిలిపోయిందా? - ఓసారి ఇలా "జిలేబీలు" చేయండి - స్వీట్​ షాప్​ స్టైల్​ పక్కా!

చిన్నతనంలో ఇష్టంగా తినే "చందమామ బిస్కెట్లు" - ఇలా చేస్తే స్వీట్​ షాప్​ టేస్ట్​ ఇంట్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.