భారీ వర్షంలో రోడ్డు నిర్మాణం.. ఇంజినీర్ల 'డెడికేషన్'కు సస్పెన్షన్‌తో సన్మానం! - road constructuion in heavy rain punjab
🎬 Watch Now: Feature Video
Road Construction In Heavy Rains: దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పంజాబ్.. హోషియార్‌పుర్ జిల్లాలోని షేర్పుర్ డాకో గ్రామంలో భారీ వర్షంలోనూ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. వెంటనే గమనించిన స్థానికులు.. అడ్డుపడినా వినిపించుకోకుండా 'తమ పని తమదే' అన్నట్లు జూనియర్ ఇంజినీర్లు వ్యవహరించారు. ఆగ్రహించిన గ్రామస్థులు.. రోడ్డు నిర్మాణ పనుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్పందించిన పంజాబ్ సర్కార్.. చర్యలు తీసుకుంది. ఘటనకు కారకులైన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన నలుగురు జూనియర్ ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.