నీటి గుంతలో పడిపోయిన ఏనుగు.. పొక్లెయిన్ సాయంతో.. - ఝార్ఖండ్ ఏనుగును కాపాడిన స్థానికిలు
🎬 Watch Now: Feature Video
ఆహారం కోసం జనవాసాల్లోకి వచ్చిన ఓ గజరాజు.. నీటి గుంతలో పడిన సంఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. రామ్‌గఢ్ జిల్లా హులు గ్రామంలోకి ప్రవేశించిన ఓ ఏనుగు వ్యవసాయ క్షేత్రంలోని నీటి గుంతలో పడిపోయింది. వెంటనే గమనించిన గ్రామస్థులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్థానిక ప్రభుత్వ అధికారులు ఏనుగును రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. పొక్లెయిన్ సాయంతో నీటి గుంత నుంచి గజరాజు బయటపడేలా చేశారు. చెరకు తినడానికి అలవాటు పడిన గజరాజులు.. వాటి కోసం రోడ్డుపైకి వచ్చి వాహనాలకు అడ్డగిస్తున్న సంఘటనలు జరిగాయి.