నడిరోడ్డుపై భారీ గుంత.. ఉప్పొంగిన వరద.. వీడియో వైరల్ - గుజరాత్లో వరదల బీభత్సం
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ధాటికి పలు రోడ్లు గుంతలమయమయ్యాయి. అహ్మదాబాద్‌లోని అమరైవాడీ మెట్రో పిల్లర్ సమీపంలో వరదల ధాటికి రోడ్డు కుంగిపోయింది. భారీ గుంత నుంచి వరద రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఇలానే ఉంటే రోడ్డు ప్రమాదాలు జరగవచ్చని స్థానికులు ఈ గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని పలువురు స్థానికులు విమర్శించారు.