రైల్వే ప్లాట్​ఫామ్​పై ఆటో నడిపిన డ్రైవర్​​, షాకిచ్చిన పోలీసులు - కుర్లా రైల్వే స్టేషన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2022, 12:32 PM IST

మహారాష్ట్రలో ఇటీవల రైల్వే స్టేషన్​ ప్లాట్​ఫామ్​పై ఆటో నడిపిన వ్యక్తిపై ముంబయి రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైల్వే కోర్టులో హాజరు పరచగా నిందితుడికి శిక్ష విధించినట్లు ట్వీట్​ చేశారు. ఈ నెల 12న ఓ ఆటో డ్రైవర్ ముంబయిలోని కుర్లా రైల్వే స్టేషన్లోకి ఆటో తీసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా ప్లాట్​ఫామ్​పై నడిపాడు. అయితే ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడం వల్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.