చిరుత పిల్లలకు బాటిల్‌తో నీళ్లు.. దగ్గర్లోనే తల్లి.. చివరకు.. - leopard cub video
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15310077-636-15310077-1652785764847.jpg)
మండే వేసవిలో, దట్టమైన అడవిలో దాహంతో విలవిల్లాడుతున్న చిరుత పిల్లల కోసం సాహసం చేశారు అటవీ శాఖ ఉద్యోగి అశోక్ ఘులే. తల్లి చిరుత వచ్చే ప్రమాదమున్నా.. ఆ కూనలకు జాగ్రత్తగా సీసాతో నీళ్లు తాగించారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా అకోలే మండలం టక్లీ గ్రామం వద్ద జరిగిందీ ఘటన. అడవిలో గోతులు తవ్వుతుండగా.. చిరుత కూనల అరుపులు వినిపించగా.. అశోక్ వాటి దగ్గరకు వెళ్లారు. ఫారెస్ట్ రేంజర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన సూచన మేరకు వాటర్ బాటిల్‌తో చిరుత పిల్లల దాహం తీర్చారు. ఈ వీడియో వైరల్ కాగా.. జంతు ప్రేమికులు, తోటి ఉద్యోగులు అశోక్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో.. బావుల్లో పడ్డ చిరుతల్ని కాపాడడంలో తన వంతు పాత్ర పోషించారు అశోక్.