50 కేజీల నిమ్మకాయలు చోరీ.. ధర రూ.20 వేలకుపైనే.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ - దొంగతనం నిమ్మకాయలు
🎬 Watch Now: Feature Video
lemon theft in Jaipur: నిమ్మకాయలు మార్కెట్లో భారీ ధర పలుకుతున్నాయి. రాజస్థాన్లోని జైపుర్ ముహానా మండీలో కేజీ నిమ్మకాయలు రూ.400కు విక్రయిస్తున్నారు. దీంతో దొంగల కళ్లు నిమ్మకాయలపై పడింది. ఓ దొంగ ఈ రిక్షాలో వచ్చి నిమ్మకాయలు కొట్టేశాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. మొత్తం 50 కేజీల నిమ్మకాయలు పోయాయని యజమాని దీపక్ చెప్పాడు. వీటి విలువ రూ.20 వేలకుపైనే ఉంటుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఎనిమిది రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.