విగ్లో గోల్డ్ పేస్ట్.. పురీషనాళంలో బంగారం ముద్ద - indira gandhi international airport
🎬 Watch Now: Feature Video
సినిమాలో సన్నివేశాన్ని తలపించే స్మగ్లింగ్ సీన్ దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆవిష్కృతమైంది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతడి స్మగ్లింగ్ శైలిని చూసి.. అధికారులు ఆశ్చర్యపోయారు. బంగారాన్ని పేస్ట్‌గా చేసి.. అందులో కొంత తల విగ్గులో.. మరికొంత తన పురీషనాళంలో దాచి పెట్టాడు. అబుదాబి నుంచి వస్తున్న అతడి వద్ద స్వాధీనం చేసుకున్న పసిడి విలువ రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై ముందే అనుమాన పడ్డ అధికారులు.. అతని లగేజీని తనిఖీ చేయగా.. ఏమీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అవసరమైన పరీక్షలు చేశారు. అలా అసలు విషయం బయటపడింది.