లైవ్ వీడియో.. వరదలో బస్సు బోల్తా.. లక్కీగా 50 మంది... - madhya pradesh bus accident today
🎬 Watch Now: Feature Video
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో బస్సు బోల్తా పడగా.. దాదాపు 50 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ష్యోపుర్ జిల్లా ఊంపచా గ్రామంలో శనివారం జరిగింది. జిల్లాలో కొద్దిరోజులుగా జోరు వర్షాలు కురుస్తుండగా.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే.. బస్సు డ్రైవర్ ఊంపచా దగ్గర్లోని వాగును దాటేందుకు యత్నించాడు. అనూహ్యంగా బస్సు పక్కకు ఒరిగిపోయింది. లోపలున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. పోలీసులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు.