టెక్స్టైల్ మిల్లులో మంటలు.. లక్షలు విలువచేసే వస్త్రాలు దగ్ధం - సూరత్ వార్తులు
🎬 Watch Now: Feature Video
Fire Accident Textile Mill: గుజరాత్ సూరత్‌లోని ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీఐడీసీ సమీపంలోని అమీనా టెక్స్టైల్ మిల్లులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే.. లక్షల రూపాయల విలువచేసే వస్త్రాలు బూడిదైనట్లు అధికారులు చెప్పారు. టెక్స్టైల్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.