Manmohan Singh Death Condolences : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రపంచ దేశాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. అమెరికా, రష్యా సహా భారత్ పొరుగు దేశాధినేతలందరూ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, ఆయనకు ఆయా దేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారు.
గొప్ప ఛాంపియన్‌ని కోల్పోయాం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా సంతాపం ప్రకటించింది. భారతదేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ ఒకరని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ కొనియాడారు. గత రెండు దశాబ్దాల్లో భారత్-అమెరికా కలిసి సాధించిన ఘనకార్యాల్లో చాలా వాటికి మన్మోహన్ సింగ్ పునాది వేశారని అన్నారు. భారత్-అమెరికా మధ్య పౌర అణు సహకార ఒప్పందం ముందుకు తీసుకెళ్లడానికి మన్మోహన్ నాయకత్వమే దోహదం చేసిందని తెలిపారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించిన నేతగా మన్మోహన్‌ను గుర్తుంచుకుంటారని అన్నారు. భారత్-అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి మన్మోహన్ సింగ్ చేసిన కృషి, అంకిత భావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని బ్లింకన్ పేర్కొన్నారు.
" the united states offers our sincere condolences to the people of india for the passing of former prime minister dr. manmohan singh. dr. singh was one of the greatest champions of the u.s.-india strategic partnership, and his work laid the foundation for much of what our… pic.twitter.com/2UmOcV8w6s
— Press Trust of India (@PTI_News) December 27, 2024
మంచి మిత్రుడిని కోల్పోయా
ఆఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ - భారత్ తన అత్యంత ప్రసిద్ధమైన కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని అన్నారు. మన్మోహన్ సింగ్ అఫ్గాన్ ప్రజలకు తిరుగులేని మంచి మిత్రుడని కొనియాడారు.
#India has lost one of its most illustrious sons. #Dr_Manmohan_Singh was an unwavering ally and friend to the people of #Afghanistan. I profoundly mourn his passing and extend my deepest condolences to his family, the government, and the people of India.
— Hamid Karzai (@KarzaiH) December 26, 2024
May his soul find… pic.twitter.com/ZrY5bCFVIR
"భారతదేశం అతన అత్యంత గొప్ప కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. ఆయన అఫాన్ ప్రజలకు మంచి స్నేహితుడు. అతని కుటుంబానికి, ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను."
- హమీద్ కర్జాయ్, ఆఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు
తండ్రి లాంటి వారు
మాల్డీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, మన్మోహన్ సింగ్ తనకు తండ్రి వంటి వారని పేర్కొన్నారు.
So sad to hear Manmohan Singh has passed. I always found him a delight to work with, and like a benevolent father figure. He was a good friend of the Maldives. @HCIMaldives pic.twitter.com/I0vnfimKpl
— Mohamed Nasheed (@MohamedNasheed) December 26, 2024
"మన్మోహన్ మరణవార్త వినడానికి చాలా బాధగా ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన నాకు తండ్రిలాంటి వారు. ఆయన మాల్దీవులకు మంచి మిత్రుడు."
- మొహమ్మద్ నషీద్, మాల్డీవుల మాజీ అధ్యక్షుడు
తీరని లోటు
మన్మోహన్ సింగ్ మృతి చెందడం భారత్, రష్యాలకు తీరని లోటు అని ఇండియాలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు.
It is moment of poignant sorrow and grief for India and for Russia. Dr Manmohan Singh‘s contribution to our bilateral ties was immeasurable. His suave demeanor was always endearing as unquestionable was his expertise as an economist and his commitment to the progress of India. pic.twitter.com/rxjUQsFgj5
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) December 26, 2024
"మన్మోహన్ సింగ్ మరణం భారత్-రష్యాలకు తీరని లోటు. ఆయన ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషి ఎనలేనిది. ఆయన చాలా సున్నితంగా ఉంటారు. కానీ ఆర్థికవేత్తగా ఆయన నైపుణ్యం, నిబద్ధత వల్లే భారతదేశం పురోగతి సాధించింది."
- డెనిస్ అలిపోవ్, రష్యా రాయబారి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. దీనితో మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రపంచదేశాలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
అవిశ్రాంత యోధుడు మన్మోహన్- రోజుకు 18 గంటల పని- పీవీ అంచనాలను సాకారం చేస్తూ!
పదేళ్లపాటు దేశాన్నేలిన మన్మోహన్ సింగ్- వైద్యుడు కావాలనుకొని!