Team India Tribute To Manmohan Singh : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం మెల్బోర్న్ టెస్టులో రెండో రోజు టీమ్ఇండియా ప్లేయర్లంతా నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అనారోగ్యంతో గురువారం రాత్రి దిల్లీలో కన్నుమూశారు. దీంతో భారత ప్లేయర్లంతా చేతికి నల్లని బ్యాండ్లు ధరించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈమేరకు బీసీసీఐ పోస్ట్ షేర్ చేసింది. 'గురువారం రాత్రి మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం టీమ్ఇండియా ప్లేయర్లు చేతికి నల్లటి బ్యాండ్ ధరించారు' అని రాసుకొచ్చింది.
కాగా, మన్మోహన్ సింగ్ 2004- 2014 మధ్య కాలంలో భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన కాలంలోనే టీమ్ఇండియా మూడు ఐసీసీ టైటిళ్లు సాధించింది. మహేంద్రసింద్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్ విజేతగా నిలిచింది.
ఇక మాజీ క్రికెటర్ల కూడా మాజీ ప్రధాని మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లందరూ సంతాపం ప్రకటిస్తున్నారు.
The Indian Cricket Team is wearing black armbands as a mark of respect to former Prime Minister of India Dr Manmohan Singh who passed away on Thursday. pic.twitter.com/nXVUHSaqel
— BCCI (@BCCI) December 27, 2024