ETV Bharat / offbeat

న్యూ ఇయర్​ కోసం రొటీన్ కేక్ వద్దు - "ఎగ్​లెస్​ క్యారెట్​ చీజ్​ కేక్‌" సూపర్ - ఇలా చేయండి! - EGGLESS CARROT CHEESE CAKE

- కొత్త సంవత్సర వేడుకల్లో సరికొత్త కేక్​ - టేస్ట్ నెక్స్ట్​ లెవల్ అంతే..

Eggless Carrot Cheese Cake
Eggless Carrot Cheese Cake (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2024, 10:13 AM IST

Eggless Carrot Cheese Cake: మరికొన్ని రోజుల్లో 2024కు ముగింపు పలికి.. కొత్త సంవత్సరాని(2025)కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక కొత్త సంవత్సరం అంటే.. కేక్​ కటింగ్​ ఉండాల్సిందే. అయితే.. చాలా మంది కేక్స్​ను మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వీటి కాస్ట్​ ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కేక్స్​ను బయట కొనుగోలు చేసేకన్నా.. కాస్త ఓపిక చేసుకుంటే ఇంట్లోనే ఫుల్ టేస్టీ ఎగ్​లెస్​ క్యారెట్​ చీజ్​ కేక్‌ను ఈజీగా చేసుకోవచ్చు. మరి, ఈ కేక్​ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • ఆయిల్​ - 180ml
  • పాలు - 270ml
  • బ్రౌన్​ షుగర్​ - 170 గ్రాములు
  • పంచదార - 170 గ్రా
  • వెనీలా అసెన్స్​ - 2 టీ స్పూన్స్​
  • మైదా - 300 గ్రాములు
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • దాల్చినచెక్క పొడి - ఒకటింపావు టీస్పూన్​
  • బేకింగ్​ పౌడర్​ - ఒకటిన్నర టీ స్పూన్​
  • బేకింగ్​ సోడా - ఒకటిన్నర టీ స్పూన్​
  • క్యారెట్​ తురుము - 300 గ్రాములు
  • వేయించిన వాల్​నట్స్​ - 70 గ్రాములు
  • ఎండు ద్రాక్ష - కొద్దిగా

ఫ్రాస్టింగ్​ కోసం:

  • పంచదార పొడి - 300 గ్రాములు
  • అన్​సాల్టెడ్​ బటర్​ - 340 గ్రాములు
  • వెనీలా అసెన్స్​ - 1 టీ స్పూన్​
  • క్రీమ్​ చీజ్​ - 340 గ్రాములు

తయారీ విధానం:

  • ముందుగా కేక్​ బేస్​ ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్​లోకి రిఫైండ్​ ఆయిల్​ తీసుకోవాలి. అందులోకి పచ్చిపాలు, బ్రౌన్​ షుగర్​, పంచదార, వెనీలా అసెన్స్​ వేసి ఎలక్ట్రిక్​ హ్యాండ్​ మిక్సర్​ సాయంతో పంచదార కరిగే వరకు వేగంగా మిక్స్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత బౌల్​ మీద జల్లెడ పెట్టి అందులో మైదా, ఉప్పు, బేకింగ్​ పౌడర్​, బేకింగ్​ సోడా, దాల్చిన చెక్క పొడి జల్లించుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కట్​ అండ్​ ఫోల్డ్​ పద్ధతిలో పిండిని బౌల్​ అడుగు నుంచి కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన క్యారెట్​ తురుము, వేయించి సన్నగా కట్​ చేసిన వాల్​నట్స్​, ఎండు ద్రాక్ష వేసి మరోసారి కట్​ అండ్​ ఫోల్డ్​ పద్ధతిలో కలుపుకోవాలి.
  • ఇప్పుడు 8 ఇంచ్​లు ఉన్న కేక్​ మౌల్డ్స్​ రెండు తీసుకుని వాటి లోపలి భాగాల్లో బటర్​ రాసి బటర్​ పేపర్​ లేదా మైదాపిండి చల్లుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె ఉంచి అందులో స్టాండ్​ పెట్టి పైన మూత ఉంచి హై ఫ్లేమ్​లో ఓ 5 నిమిషాలు ఫ్రీహీట్​ చేసుకోవాలి. మరో స్టవ్​ మీద కూడా ఇలానే చేయాలి. అయితే ఇక్కడ తీసుకున్న మిశ్రమానికి అనుగుణంగా రెండు కేక్​ మౌల్డ్​ తీసుకున్నాం. మీరు తీసుకునే కొలతలను బట్టి వాటిని తీసుకోండి.
  • ఇప్పుడు రెండు కేక్ మౌల్డ్స్​లోకి కేక్​ మిశ్రమాన్ని సమానంగా పోసుకుని ఓసారి ట్యాప్​ చేసుకోవాలి.
  • ప్రీ హీట్​ చేసుకున్న ఒక గిన్నెలో ఒక మౌల్డ్​, మరో గిన్నెలో మరో మౌల్డ్​ పెట్టి రెండింటి మీద మూతలు పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద సుమారు 35 నుంచి 40 నిమిషాలపాటు బేక్​ చేసుకోవాలి. కేక్​ బేక్​ అయ్యిందో లేదా టూత్​ పిక్​ సాయంతో చెక్​ చేసుకుని వాటిని తీసి ఓ గంటపాటు చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఫ్రాస్టింగ్​ ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్​లోకి రూమ్ టెంపరేచర్​లో అన్​సాల్టెడ్​ బటర్​ను తీసుకుని ​ఎలక్ట్రిక్​ హ్యాండ్​ మిక్సర్​ సాయంతో ఫాస్ట్​గా బీట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి కొద్దిగా పంచదార పొడి వేసి ఓ సారి కలిపి మళ్లీ బీట్​ చేసుకోవాలి. అనంతరం వెనీలా అసెన్స్​, మిగిలిన పంచదార పొడి వేసి పంచదార బటర్​లో కరిగే విధంగా హై స్పీడ్​ మీద బీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోకి రూమ్​ టెంపరేచర్​లో ఉన్న క్రీమ్​ చీజ్​ను వేసి కలిపి బాగా బీట్​ చేసుకోవాలి. ఇలా బీట్​ చేసుకున్న మిశ్రమం కరిగిపోకుండా ఫ్రిజ్​లో పెట్టాలి.
  • చివరగా కేక్​ డెకరేషన్​ చేసుకోవాలి. అందుకోసం ముందుగా మౌల్డ్స్​ నుంచి కేక్​ను సెపరేట్​ చేసుకుని కేక్​ బోర్డ్​ లేదా ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వాటిపైన ఉండే మందపాటి లేయర్​ను జాగ్రత్తగా కట్​ చేసి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు ఆ కేక్​ మీద ముందే ప్రిపేర్​ చేసుకుని ఫ్రిజ్​లో పెట్టుకున్న క్రీమ్ చీజ్​ను కొద్దిగా అప్లై చేసి కేక్​ మొత్తం స్ప్రెడ్​ చేయాలి. ఆ తర్వాత మరో కేక్​ బేస్​ను పెట్టి దాని మీద కూడా క్రీమ్​ను అప్లై చేసి కేక్​ మొత్తం స్ప్రెడ్​​ చేయాలి.
  • ఇప్పుడు మిగిలిన క్రీమ్​ను కేక్​ చుట్టూ కొద్దికొద్దిగా అప్లై చేసుకుంటూ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇక మిగిలిన క్రీమ్​ను పైపింగ్​ బ్యాగ్​లోకి వేసుకుని దానికి ఏదైనా షేప్​ కలిగిన నాజిల్​ పెట్టి మీకు నచ్చిన డిజైన్​ను కేక్​ మీద వేసుకోవాలి.
  • ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న కేక్​ మీద మందపాటి లేయర్​ను చిన్నగా చేతితో నలిపి కేక్​ మీద స్ప్రెడ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్​లెస్​ క్యారెట్​ చీజ్​ కేక్​ రెడీ.
  • నచ్చితే మీరూ ఈ కేక్​ను న్యూ ఇయర్​కు ప్రిపేర్​ చేసుకుని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్​ చేయండి.

ఎగ్, ఓవెన్ లేకుండానే - నోరూరించే "బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

బేకరీ స్టైల్ ​"వెనీలా స్పాంజ్​ కేక్" - ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా లాగిస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.