Vicky Kaushal Chhaava Openings : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నటి రష్మిక లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'ఛావా' తాజాగా ఓ అరుదైన రికార్డును సృష్టించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.31 కోట్లు వసూళ్లు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా చరిత్రకెక్కింది.
ప్రీ సేల్ బుకింగ్స్ అదుర్స్!
ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్‌లో అదరొగట్టింది. ఏకంగా 5 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ టీమ్ తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఇంతటి ఆదరణ వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. వీకెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని స్క్రీన్‌ల సంఖ్యనుస కూడా పెంచుతున్నట్లు ఈ మేరకు తెలిపింది.
ప్రశంసల వెల్లువ
ఇక ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించి మెప్పించారని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌లో ఎమోషనలయ్యామంటూ చెప్పుకొచ్చారు.
స్టోరీ ఏంటంటే?
ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్టార్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనమైందని, ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం, పాలించడం సులభం అవుతుందని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటూ, కట్టకపోతే హింసిస్తున్న మొగల్ సామంతుల భరతం పడుతుంటాడు.
ఈ విషయం కాస్త ఔరంగజేబుకు చేరడం వల్ల తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరు? ఇవన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
'నేషనల్ క్రష్ ట్యాగ్‌తో టికెట్లు అమ్ముడుపోవు'- రష్మిక మంధన్నా
రిటైర్మెంట్ గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్! - 'అప్పుడే ఆ డైరెక్టర్‌కు చెప్పాను'