పాపం గజరాజు.. కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే.. - తమిళనాడు వార్తలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ అడవి ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. జిల్లాలోని గూడలూరులో వ్యవసాయ భూమిలోకి వచ్చిన గజరాజు.. అక్కడే ఉన్న తమలపాకుల చెట్టును నేల కూల్చింది. అదే సమయంలో విద్యుత్ తీగ తెగి ఏనుగు మీద పడడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. సమీపంలో ఓ గొయ్యి తీసి ఏనుగు మృతదేహాన్ని పూడ్చివేశారు.
Last Updated : Sep 24, 2022, 11:47 AM IST