కరెంటు తీగలపై సాహసం.. ఎలాంటి ఆధారం లేకుండానే.. - విద్యుత్ తీగలపై సాహసం
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో విద్యుత్ ఉద్యోగి సాహసం చేశాడు. బలమైన ఈదురు గాలులకు కొండగావ్ ప్రాంతంలో విద్యుత్ తీగల మధ్య చెట్ల కొమ్మలు చిక్కుకున్నాయి. దీంతో స్థానిక విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న గద్వా రామ్.. ప్రమాదకరంగా తీగలకు వేలాడుతూ చెట్ల కొమ్మలను తొలగించాడు. ఎలాంటి రక్షణ లేకుండానే ఈ సాహసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొమ్మలు తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయిందని స్థానికులు తెలిపారు.