పామును ముద్దాడిన సంరక్షుడు.. పెదవిపై కాటేసిన సర్పం.. చివరకు - పామును ముద్దాడిన స్నేక్ క్యాచర్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ నాగుపామును పట్టుకున్న సంరక్షకుడు దాని తలపై ముద్దాడాడు. దీంతో ఆ సర్పం ప్రతిఘటించి అతడి పెదవిపై కాటు వేసింది. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టిన సంరక్షకుడు అలెక్స్.. తర్వాత ఆస్పత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అలెక్స్ కోలుకుంటున్నాడు.