ఆకట్టుకుంటున్న 'సీ చెస్'.. సముద్రంలోని 60 అడుగుల లోతులో.. - స్కూబా కంపెనీ
🎬 Watch Now: Feature Video
చెస్ పోటీలపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు స్కూబా డైవింగ్ కంపెనీ ప్రతినిధులు. సముద్రంలోని 60 అడుగుల లోతులో చెస్ ఆడారు. ఈ పోటీలు తమిళనాడు చెన్నైలోని నీలాంగరై బీచ్లో నిర్వహించారు. చెస్ ఒలింపియాడ్ తమిళనాడులో జరుగుతున్న నేపథ్యంలో 'సీ చెస్' పేరుతో చెన్నైలో తొలిసారి నిర్వహించింది. తమిళనాడు మహాబలిపురంలో 44వ ఒలింపియాడ్ పోటీలు జులై 28న ప్రారంభమయ్యాయి. ఆగష్టు 9న ముగియనున్నాయి.