LIVE : హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - HYDRA COMMISSIONER RANGANATH LIVE
🎬 Watch Now: Feature Video
Published : 14 hours ago
|Updated : 13 hours ago
Hydra Commissioner Ranganath Live : హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. హైడ్రా ఇప్పటివరకు 200 ఎకరాల భూమిని కాపాడిందని రంగనాథ్ తెలిపారు. తాము ఇంతవరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామని, తమ చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని తెలిపారు. అలాగే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని చెప్పారు. చెరువుల అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నామని, ఇందుకోసం ఎన్‌ఆర్‌ఎస్‌ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని మీడియా సమావేశంలో ప్రకటించారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని వాటి ఆధారంగా ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా మార్కింగ్ చేస్తామని స్పష్టం చేశారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలకు సంబంధించి హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలుంటాయని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : 13 hours ago