దూడకు గుండు కొట్టించి.. ఊరేగించిన రైతు.. కారణం తెలిస్తే షాక్! - ఉత్తర్​ప్రదేశ్​ లేటస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 28, 2022, 11:40 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని హర్​దోయి జిల్లాలోని వింత సంఘటన జరిగింది. బఘౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవ అనే రైతు.. తాను పెంచుకుంటున్నదూడకు గ్రామంలోని మాతృదేవత ఆలయంలో గుండు కొట్టించాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి పెద్ద విందును సైతం ఏర్పాటు చేశాడు. విందుకు రావాల్సిందిగా గ్రామస్థులందరిని ఆహ్వానించాడు. అతను ఇలా చేయడానికి కారణం అతని ఇంట్లోని దూడలు చనిపోతున్నాయని.. దీంతో ఓ పూజారిని ఆశ్రయించాడు రైతు. పుట్టిన పిల్లలకు చేయించినట్లుగానే దూడకు సైతం గంగానది ఒడ్డున గుండు చేయిస్తే ఆ దూడ పిల్ల చనిపోదని సూచించాడు. అందుకే దూడకు మూడేళ్లు రాగానే దానికి గుండు కొట్టించానని తెలిపాడు. ఈ విషయం ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.