అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం.. ఎక్కడంటే? - కర్ణాటకలో శ్వేతనాగు
🎬 Watch Now: Feature Video
కర్ణాటక శివమొగ్గలో ఓ అరుదైన పాము కనిపించింది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న కోబ్రా తీర్థహల్లిలోని గార్డెన్లో కనిపించింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ అరుదైన శ్వేతనాగును అల్బినో కోబ్రాగా పిలుస్తారు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకుంది. అటవీశాఖ అనుమతితో ఈ సర్పాన్ని అడవిలో విడిచిపెడతామని రెస్క్యూ టీం చెప్పింది. చర్మ, రక్త సంబంధిత కారణాల వల్లే ఇలా జరుగుతోందని పేర్కొన్నారు.