ప్రతిధ్వని: యువత ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి..? - ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
స్వతంత్ర భారతం అనేక సవాళ్లను అధిగమిస్తూ.. ప్రగతి పథంలో దూసుకుపోతోంది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొని వృద్ధి సాధించాలంటే యువతే కీలకం. ఏ దేశ అభివృద్ధిలో అయినా... యువత నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన యువతను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే... భారత్ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదు. ప్రస్తుత సంక్షోభంలోనూ యువత ఎదిగేందుకు అనేక అవకాశాలున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం యువత నైపుణ్యాలకే పెద్దపీట వేసింది. స్కిల్ ఇండియా లాంటి పథకాలు యువతకు అండగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో... యువత ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి..? యువతలో నైపుణ్యలేమి సమస్యలను ఎలా అధిగమించాలి..? దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంత కీలకం అనే అంశాలపై ప్రతిధ్వని చర్చ.