జోనల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌గా నిలిచిన వనస్థలిపురం నారాయణ పాఠశాల - NARAYANA STUDENTS EXCEL IN SPORTS
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2024, 7:51 PM IST
Narayana School Students Excel In Sports : నారాయణ పాఠశాలల దిల్‍సుఖ్‍నగర్ జోనల్ స్థాయి ఆటలపోటీల్లో వనస్థలిపురం బ్రాంచ్ విద్యార్ధులు విశేష ప్రతిభ ప్రదర్శించారు. నవంబర్ 21, 22 తేదీల్లో జరిగిన ఈ క్రీడాపోటీల్లోని పలు అంశాల్లో ఏకపక్ష విజయాలు నమోదుచేశారు. కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్స్, రన్నింగ్ ఈవెంట్లలో అనేక బహుమతులు పొందారు. ఈ సందర్భంగా అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న విద్యార్ధులకు నారాయణ పాఠశాల వనస్థలిపురం గ్రౌండ్‍లో అభినందన సభ నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాల జీఎం గోపాల్‍రెడ్డి, ఏజీఎం హేమాంబర్, ఆర్ఎం రవిప్రసాద్, ప్రిన్సిపల్ భవాని తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో చక్కటి ప్రతిభ ప్రదర్శించిన చిన్నారులను వీరంతా కొనియాడారు. సమష్టిగా రాణించి జోనల్ స్థాయి ఛాంపియన్‍షిప్ సాధించారని ఈ విజయంతో పాఠశాల కీర్తిప్రతిష్ఠలను మరింతగా ఇనుమడింపజేశారని విద్యార్ధులను అభినందించారు. క్రీడాకారులు సాధించిన షీల్డులు, జోనల్ ఛాంపియన్‍షిప్ మొమెంటోలను విద్యార్ధులందరూ అపురూపంగా వీక్షించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.