వైరల్​ వీడియో - ఫైట్ మాస్టర్స్ రామ్​ లక్ష్మణ్ శునకానికి సహాయం - FIGHT MASTERS TEAM SAVED DOG

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 2:41 PM IST

Fight Masters Ram Laxman Saves Dog at Shooting Spot : హైదరాబాద్​లోని అజీజ్ నాగర్​లోని హీరో ప్రభాస్​ నూతన చిత్రం రాజాసాబ్ షూటింగ్ క్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్​ లక్ష్మణ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అటు పరిసరాల్లో శబ్దాలు వినిపించాయి. ఇది గమనించిన మేనేజర్ వెళ్లి చూడగా అక్కడ చిన్న కొండలో చిక్కుకుపోయిన ఓ కుక్క ఉంది. ఈ నేపథ్యంలో ఫైట్ మాస్టర్స్​తో పాటు అందరూ వెంటనే కుక్కను కాపాడేందుకు క్రేన్ సహాయంతో బయటకు తీయడానికి ప్రయత్నించారు.

కానీ ప్రయత్నించే క్రమంలో క్రేన్ రూఫ్ కూడా తెగిపోయింది. కొండ రాయిని పక్కకు లాగుదామని ప్రయత్నించగా ఆ పని కూడా అవ్వలేదు. తర్వాత చిన్నగా రాయిని పక్కకు తొలగించి కుక్క కాలుకి ఒక తాడుని కట్టి చిన్నగా బయటకు తీశారు. దీంతో ఆ కుక్కను పిల్లల దగ్గరకు తల్లిని చేర్చారు రామ్​ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ అండ్ టీం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.