Bumrah Border Gavaskar Trophy : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అత్యుత్తమ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లోనే 30 వికెట్లు పడగొట్టి, ఈ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఘనతలు సాధించిన బుమ్రా, మరో భారీ రికార్డుపై కన్నేశాడు. అదేంటంటే?
ఈ సిరీస్‌లో బుమ్రా మరో 6 వికెట్లు పడగొడితే, భారత్ తరఫున ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది. 1972- 73లో ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ 35 వికెట్లు తీశాడు. ఇప్పటిదాకా ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చంద్రశేఖర్ పేరిటే ఈ రికార్డు ఉంది. కాగా, 52ఏళ్ల ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు బుమ్రాకు మంచి ఛాన్స్ ఉంది.
ఇక ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు ఇది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. జనవరి 3న భారత్- ఆసీస్ మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. సిడ్నీ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
దరిదాపుల్లో లేరు
30 వికెట్లతో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా, రెండో స్థానంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 20 వికెట్లతో ఉన్నాడు. అంటే అగ్ర స్థానంలో ఉన్న బుమ్రా, రెండో ప్లేస్‌లో ఉన్న కమిన్స్‌కు మధ్య 10 వికెట్ల భారీ తేడా ఉంది. 16 వికెట్లతో మహ్మద్ సిరాజ్ మూడో ప్లేస్‌లో ఉండగా, మిచెల్ స్టార్క్ 15 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2- 1తో ఆసీస్ లీడ్‌లో ఉంది. ఈ సిరీస్‌ను డ్రా గా ముగించి, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే టీమ్ఇండియా ఆఖరి టెస్టులో పక్కాగా విజయం సాధించాల్సిందే. ఈ టెస్టు కోసం మేజేజ్మెంట్ ఒకట్రెండు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి రావొచ్చని తెలుస్తోంది.