ETV Bharat / state

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి స్పెషల్‌ ట్రైన్స్‌ - జనవరి 2 నుంచే టికెట్ల బుకింగ్​ - SPECIAL TRAINS SANKRANTI FESTIVAL

సంక్రాంతి పండుగ నేపథ్యంలో 6 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు - నాలుగు రోజులు రాకపోకలు సాగించనున్న ప్రత్యేక రైళ్లు - టికెట్ల బుకింగ్ 2వ తేది నుంచి ఉంటుందని వెల్లడి

SOUTH CENTRAL RAILWAY
SPECIAL TRAINS FOR SANKRANTI FESTIVAL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 10:15 PM IST

Updated : Jan 1, 2025, 10:23 PM IST

Special Trains For Sankranti Festival : సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ -కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేకంగా సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్‌ ట్రైన్స్‌ జనవరి 9, 10, 11, 12 వరకు నాలుగు రోజులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్‌ రిజర్వేషన్ల బుకింగ్‌ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లలో స్లీపర్‌, జనరల్‌ బోగీలు, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ ఉంటాయని తెలిపారు.

  • కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి తరువాతి రోజు ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్‌ -కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 న కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయాన్నే 4.30 గంటలకు హైదరాబాద్‌లోని కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైళ్లు చర్లపల్లి, మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి.
  • అలాగే, హైదరాబాద్‌ -కాకినాడ టౌన్‌ రైలు (07023) జనవరి 10 న సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యి మరుసటి రోజు 11వ తేదిన ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు 12 వ తేది ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, భీమవరం టౌన్‌, తణుకు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

పండక్కి ఊరెళ్తున్నారా? - హైదరాబాద్​ టూ తిరుపతికి స్పెషల్‌ ట్రైన్స్‌ - డీటెయిల్స్​ ఇవే - Special Trains To Tirupati

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు

Last Updated : Jan 1, 2025, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.