ETV Bharat / state

మరో వివాదంలో మోహన్​బాబు ఫ్యామిలీ! - ఇంతకీ ఏం జరిగింది? - MANCHU FAMILY ANOTHER CONTROVERSY

అడవి పందిని వేటాడిన మంచు విష్ణు సిబ్బంది వీడియో కలకలం - అధికారులు ఎలా ఊరుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు

Manchu Mohanbabu Family In Yet Another Controversy
Manchu Mohanbabu Family In Yet Another Controversy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 9:46 PM IST

Manchu Mohanbabu Family In Yet Another Controversy : కుటుంబ వివాదాలతో వీధికెక్కిన సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇంటి వివాదం మరింతగా ముదురుతోంది. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ ఫిర్యాదుపై పహాడీషరీఫ్‌ ఠాణాలో కేసు నమోదైన విషయం విధితమే. తాజాగా మరో వివాదంలో మోహన్‌బాబు ఫ్యామిలీ చిక్కుకుంది.

జల్‌పల్లి అటవీప్రాంతం పక్కనే మోహన్​బాబు ఇల్లు ఉంది. ఆ ఫారెస్ట్​ ఏరియాలో జింకలు, నెమళ్లు సహా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. మోహన్‌బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణుకు సంబంధించిన మేనేజర్‌ కిరణ్‌ మరో ఇద్దరితో కలిసి అడవిపందిని వేటాడి ఇంటికి తీసుకెళుతున్నటువంటి వీడియో మంగళవారం సామాజిక సోషల్ మీడియాలో కలకలం రేపింది.

నెటిజన్ల మండిపాటు : వన్య ప్రాణులను శిక్షిస్తే ఫారెస్ట్​ అధికారులు ఎలా ఊరుకుంటున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్నటువంటి దృశ్యాలు తమ దాకా వచ్చాయని, దీనిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి స్పష్టంచేశారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అటవీ అధికారులకు లేదా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు - ముందస్తు బెయిల్‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

'కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ' : జర్నలిస్టును పరామర్శించిన మోహన్​బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.