ప్రతిధ్వని: స్టాక్ మార్కెట్ల పతనం, అందుకు గల కారణాలు! - స్టాక్ మార్కెట్ల పతనం, అందుకు గల కారణాలు
🎬 Watch Now: Feature Video

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా ఆరో రోజు కొనసాగింది. సెన్సెక్స్ 1100కు పైగా పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 11 వేల మార్కు దిగువకు చేరింది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, మళ్లీ లాక్డౌన్కు యూరప్ దేశాలు సంసిద్ధమవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వెల్లడించడం, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, చైనాతో నెలకొన్న ప్రతిష్ఠంభన వంటి అంశాలు స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం, అందుకు గల కారణాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.