సైకత శిల్పంతో టీమిండియాకు 'ఆల్ ద బెస్ట్' - టీమిండియాకు ఆల్ ద బెస్ట్
🎬 Watch Now: Feature Video
ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా నేడు భారత్,న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన గెలవాలని కోరుకుంటూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ విభిన్నంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఒడిశాలోని పూరీ తీరంలో కోహ్లీ చిత్రం, ప్రపంచకప్ కలిపి సైకత శిల్పం రూపొందించారు. నేడు కివీస్‌తో మ్యాచ్ గెలిచి టీమిండియా ఫైనల్ చేరాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది.