Trump On Biden Executive Order : ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు అధికార మార్పిడి చేసే ప్రక్రియను క్లిష్టతరం చేసేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలను బైడెన్ చేస్తున్నారని ఆరోపించారు. పదవీ కాలం కొన్ని వారాలే మిగిలి ఉన్న ప్రస్తుత తరుణంలో పర్యావరణం, ఇతరత్రా చట్టాలపై బైడెన్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలే ఇందుకు నిదర్శనమని ట్రంప్ విమర్శించారు. ఈమేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
'లాఫేర్ డాక్యుమెంటరీ నుంచి మొదలుకొని గ్రీన్ న్యూ స్కాం దాకా అమెరికా సంపదను ఆవిరి చేసే వివాదాస్పద అంశాలపై బైడెన్ హుటాహుటిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను జారీ చేశారు. ఇవన్నీ హాస్యాస్పద చర్యలు. వాటికి భయపడొద్దు. నేను దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టగానే బైడెన్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను తొలగిస్తా' అని ట్రంప్ పేర్కొన్నారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలను అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం ధ్రువీకరించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
కొత్తగా ఆయిల్ డ్రిల్లింగ్‌పై బ్యాన్ ?
'నేను అధ్యక్షుడిని అయ్యాక అమెరికాలోని ఈస్ట్ కోస్ట్, కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్‌లలో కొత్తగా ఆయిల్, నేచురల్ గ్యాస్ డ్రిల్లింగ్‌ను ఆపేస్తాను. అలస్కా తీరం, మెక్సికో తూర్పు తీరం, ఉత్తర బేరింగ్ సముద్రంలలోని కొన్ని ప్రాంతాల్లోనూ డ్రిల్లింగ్‌పై బ్యాన్ విధిస్తాను' అని ఇటీవలే ట్రంప్ అనౌన్స్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆయిల్ డ్రిల్లింగ్‌కు అనుమతులు మంజూరు చేస్తూ ఇటీవలే బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను జారీ చేశారు.
ట్రంప్ కార్యవర్గం రెడీ
47వ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వం కోసం కార్యవర్గాన్ని ఆయన ఇప్పటికే ఎంపిక చేసుకున్నారు. అందులో చాలామంది భారత సంతతి వారికి కూడా ఛాన్స్ దక్కింది. తన ప్రభుత్వంలో ఉండనున్న వారి వివరాలను వైట్ హౌస్‌కు ట్రంప్ ఇప్పటికే పంపారు. ఇక తనపై ఉన్న నేరాభియోగాలు, వివిధ కేసులు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ట్రంప్ అంటున్నారు. ఇదే అంశాన్ని కోర్టుల ఎదుట వినిపిస్తున్నారు.
ట్రంప్ విక్టరీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ - జనవరి 20న ప్రమాణానికి లైన్ క్లియర్!
హష్ మనీ కేసులో ట్రంప్‌నకు శిక్ష విధిస్తా - కానీ జైలు, జరిమానా రెండూ ఉండవ్: జడ్జ్