Upasana Instagram Story on Parrot Missing : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆఫ్రికన్ గ్రే చిలుక వారం రోజుల క్రితం తప్పిపోయి చివరికి వారి వద్దకే చేరింది. వీరు పలు రకాలైన పెంపుడు జంతువులు, పక్షులు పెంచుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. వాటిలో ఒక ఆఫ్రికన్ గ్రే చిలుకను 'కుట్టి' పేరుతో పెంచుకుంటున్నారు. వారం క్రితం కుట్టి చిలుక తప్పిపోయింది. ఈ విషయంపై ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో కుట్టి తప్పిపోయిందని పోస్ట్‌చేయగా మెసేజ్ పలు పెట్ లవర్స్ గ్రూపుల్లోకి వెళ్లింది.
చిలుక కాలుకి ఉన్న రింగ్‌తో గుర్తింపు : హైదరాబాద్‌లోని ఏడబ్ల్యూసీఎస్ అనే జంతు ప్రేమిక సంస్థ ఈ ఆఫ్రికన్ గ్రే కుట్టి చిలుకను గుర్తించింది. సంస్థ సభ్యులు ఇంటర్నెట్లో వెతుకుతుండగా ఉపాసన పోస్టును చూశారు. చిలుక కాలి రింగుకు ఉన్న ఐడీని చూసి ఏడబ్ల్యూసీఎస్ వారు ఇది ఉపాసన పెట్టిన పోస్టులోని కుట్టి చిలుకగా నిర్ధారించుకున్నారు. దీంతో వారి ఇంటికి కుట్టిని తీసుకువెళ్లగానే రామ్‌చరణ్ భుజం మీద వాలింది. దంపతులిద్దరూ ప్రేమతో ఆఫ్రికన్ గ్రే కుట్టిని దగ్గరకు తీసుకున్నారు. తమ కుట్టిని తీసుకువచ్చినందుకు సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులు : రామ్‌చరణ్ పెట్స్ మీద ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు. ఆ పోస్టులను చూసి అభిమానులు స్పందిస్తూ రకరకాల కామెంట్స్ పెడుతుంటారు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఇటీవల సంక్రాంతి పండుగకు విడుదలై అభిమానుల నుంచి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
భారీ అంచనాలతో బుచ్చిబాబు RC16 : ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ నేపథ్యంలో కథ ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. దీంట్లో సీనియర్ నటులు జగపతి బాబు, కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
'పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ నా అచీవ్మెంట్స్- నేను సాధించింది అదే'- మెగాస్టార్