ETV Bharat / health

కరోనాలా HMPV ప్రమాదకరంగా మారుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - HMPV VIRUS IS DANGEROUS

-2001లో HMPV గుర్తించామని వైద్యుల వెల్లడి -ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?

hmpv virus is dangerous
hmpv virus is dangerous (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 7, 2025, 10:42 AM IST

HMPV Virus is Dangerous: కొవిడ్‌-19 దాడి నుంచి ఇప్పుడే కోలుకుంటుండగా.. మరో కొత్త వైరస్‌ ఆందోళన ప్రజల్లో మొదలైంది. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్‌ మెటాన్యుమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మనదేశంలోనూ ఈ వైరస్ కేసులు బయటపడినట్టు తేలడంతో అందరిలో భయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కడిదీ వైరస్‌?
మామూలు జలుబు మాదిరిగానే హెచ్‌ఎంపీవీ కూడా దిగువ, పై శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.వి రావు చెబుతున్నారు. ఇది రెస్పిరేటరీ సిన్‌సిషియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వీ) వంటి వైరస్‌ల తరగతికి చెందినదని.. దీన్ని 24 ఏళ్ల క్రితమే 2001లోనే నెదర్లాండ్స్‌లో గుర్తించారని వివరించారు. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా సోకొచ్చు గానీ చలికాలం, వసంతకాలం ఆరంభంలో ఎక్కువగా వ్యాపిస్తుందని వెల్లడించారు. హెచ్‌ఎంపీవీ కొందరిలో న్యుమోనియాకు దారితీయొచ్చని.. ఆస్థమా, సీఓపీడీ వంటి జబ్బులను ఉద్ధృతం చేయొచ్చని అంటున్నారు. ఇంకా చాలామందికి ఐదేళ్లలోపే ఇది తొలిసారి సోకుతుందని.. అనంతరం ఎప్పుడైనా మళ్లీ వచ్చినా లక్షణాలు చాలావరకూ మామూలుగానే ఉంటాయన్నారు. ఇలా పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 10-12% హెచ్‌ఎంపీవీయే కారణమవుతున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలామందిలో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుందని అంటున్నారు. కానీ 5-16% మంది పిల్లల్లో న్యుమోనియా వంటి దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని హెచ్చరించారు.

"హెచ్‌ఎంపీవీయే నిజానికి మామూలు జలుబు, ఫ్లూ వైరస్‌ల వంటిదే. సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ముఖ్యంగా 6-12 నెలల పిల్లలకు ఎక్కువగా సోకుతున్నట్టు పలు దేశాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి అంత తీవ్రమైంది కాదు. కాకపోతే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పిల్లలకు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అలాగే 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ మామూలు జలుబులా మొదలై అరుదుగా కొందరికి న్యుమోనియాగా మారే అవకాశం ఉంది. ఇంకా గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు, మధుమేహం, ఆస్థమా, నాడుల బలహీనత, సీవోపీడీ, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి.. క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారికి, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది."

--డాక్టర్ ఎం.వి రావు, జనరల్ ఫిజీషియన్

కొవిడ్‌లా ప్రమాదకరం కాదు
ఇది కొవిడ్‌ అంత తీవ్రమైన వైరస్‌ కూడా కాదని డాక్టర్ ఎం.వి రావు వెల్లడించారు. రక్తనాళాలను దెబ్బతీయటం, రక్తం గడ్డలు ఏర్పడేలా చేయటం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయదని వివరించారు. కొవిడ్‌-19కూ హెచ్‌ఎంపీవీకి తేడా ఏంటంటే ఇది కొత్తది కాకపోవటమేనని చెబుతున్నారు. అప్పట్లో కొవిడ్‌-19 కొత్త వైరస్‌ కావటం వల్ల దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరంలో యాంటీబాడీలు లేకపోవడం వల్ల తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ప్రస్తుతం మనం దాన్ని ఎదుర్కొనే నిరోధకశక్తి సంతరించుకోవటం వల్ల అదే కొవిడ్‌ ఇప్పుడు మామూలు జలుబులా మారిందని అంటున్నారు. హెచ్‌ఎంపీవీ ఎప్పటినుంచో ఉంది కాబట్టి చాలామందిలో దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండే ఉంటాయని అభిప్రాయపడ్డారు. కాబట్టి అంతగా భయపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు.

ప్రత్యేక చికిత్సేమీ లేదు
అయితే, హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్‌కు ప్రత్యేక చికిత్స ఏమీ లేదని ఆయన చెబుతున్నారు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తారని.. జలుబు లక్షణాలు తగ్గటానికి యాంటీ హిస్టమిన్లు, జ్వరానికి పారాసిటమాల్‌ ఉపయోగపడతాయని వివరించారు. ఒకవేళ న్యుమోనియా వచ్చి రక్తంలో ఆక్సిజన్‌ తగ్గితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంకా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ పనిచేయవని.. కాబట్టి జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆయా వైరస్‌లను బట్టి మందులు వాడుకోవాలని సలహా ఇస్తున్నారు. శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గిన తర్వాత కొందరికి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చని అంటున్నారు. దీంతో శ్లేష్మం పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారుతుందని.. అప్పుడు మాత్రమే డాక్టర్‌ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్‌ వాడుకోవాలని సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి
హెచ్‌ఎంపీవీ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న 5-65 ఏళ్ల మధ్య వయసువారిని ఏమీ చేయదని డాక్టర్ ఎం.వి రావు చెబుతున్నారు. అయితే చైనాలో 14 ఏళ్ల లోపు వారినీ ఎక్కువగా ప్రభావితం చేస్తోందని అంటున్నారు. నిజానికి దీని విషయంలోనే కాకుండా.. ఫ్లూ, జలుబు వంటి ఎలాంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల విషయంలోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని సూచిస్తున్నారు. అలవాట్లు, ప్రవర్తన మార్చుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సలహా ఇస్తున్నారు.

  • జలుబు లక్షణాలు కనిపిస్తే విడిగా ఉండాలి. ఇతరులకు దూరం పాటించాలి.
  • 65 ఏళ్లు పైబడ్డవారు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
  • ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా మాస్కు ధరించాలి.
  • దగ్గు, తుమ్ములతో బాధపడే పిల్లలను బడికి పంపించొద్దు.
  • బయటి నుంచి ఇంట్లోకి రాగానే కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాతే ఇంట్లో వస్తువులను తాకాలి.
  • తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు.. రుమాలు, టిష్యూ పేపర్‌ అడ్డు పెట్టుకోవాలి.
  • ఇతరులకు కరచాలనాలు చేయొద్దు. అనసరంగా ముక్కు, కళ్లు, నోటిని చేత్తో తాకొద్దు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చైనా కొత్త వైరస్​ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? నివారణ ఎలా? చికిత్స ఏదైనా ఉందా?

మధుమేహం ఉన్నా ఈ పండ్లను హాయిగా తినొచ్చట! ఇవి తింటే షుగర్ పెరగదని నిపుణుల సలహా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.