క్రిస్మస్ ట్రీ విసరడంలో ప్రపంచ స్థాయి పోటీలు - Christmas Tree Throwing World Championship fest
🎬 Watch Now: Feature Video
జర్మనీలోని వైడెంతల్ పట్టణంలో నిర్వహించిన క్రిస్మస్ ట్రీ త్రోయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ -2020 ఉత్సాహంగా సాగింది. ఏటా క్రిస్మస్ అనంతరం జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఓ మోస్తరు బరువు ఉన్న క్రిస్మస్ ట్రీ కొమ్మతో జావెలిన్ త్రో, స్నిప్పింగ్, హై జంప్ లాంటి పోటీలను నిర్వహిస్తారు. ఈ సారి కూడా పోటీలు రెట్టించిన ఉత్సాహంతో జరిగాయి. విజేతలకు చెక్కతో తయారు చేసిన ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈసారి క్రిస్మస్ ట్రీ త్రోయింగ్ హైజంప్‌లో కొత్త ప్రపంచ రికార్డు(5.75 మీటర్లు) నమోదు కావడం విశేషం.
TAGGED:
Knut Fest