'తెలుగు ప్రజలందరికీ ఇకపై నేను వెంకీమామనే..' - తాజా వెంకీ మామ సినిమా వార్తలు
🎬 Watch Now: Feature Video
వెంకటేశ్, నాగచైతన్య మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో చిత్ర బృందం 'వెంకీమామ' ముందస్తు విడుదల వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. వేలాది మంది అభిమానుల మధ్యకు వెళ్లి సందడి చేసింది చిత్రయూనిట్. వేదికపై వెంకటేశ్, నాగచైతన్యతోపాటు కథానాయికలు రాశికన్నా, పాయల్ రాజ్‌పుత్ నృత్యాలు చేసి అభిమానులను అలరించారు. అనంతరం భావోద్వేగంతో అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు వెంకటేశ్.