నాన్న సినిమాలు రీమేక్ చేయను: మహేశ్ - vamsi tollywood
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3318721-thumbnail-3x2-majarshi.jpg)
'మహర్షి' చిత్రం విజయవంతం అయిన సందర్భంగా చిత్ర కథానాయకుడు మహేశ్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన 'రేపటితరం మహర్షుల' ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా మహేశ్‌ను విద్యార్థులు ప్రశ్నలతో ముంచెత్తారు. నాన్న (కృష్ణ) సినిమాలు రీమేక్ చేస్తారా అన్న ప్రశ్నకు.. నాన్న సినిమాలు అన్నీ మంచి చిత్రాలని..వాటిని చెడగొట్టే పనిచేయనని స్పష్టం చేశాడు మహేశ్. హెచ్‌పీఎస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. త్వరలో పాఠశాల క్యాంపస్‌లో మంచి స్థలం చూసి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటుచేసి.. విద్యార్థులు తప్పకుండా వ్యవసాయం గురించి తెలుసుకునేలా చేస్తామని తెలిపారు.