Yuvagalam TDP Flags Display at Eiffel Tower ఫ్రాన్స్​ ఐఫిల్ టవర్ వద్ద యువగళం జెండా రెపరెప.. లోకేశ్​కు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అభిమానులు - ఫ్రాన్స్​లో యువగళం టీడీపీ జెండా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 3:17 PM IST

Yuvagalam TDP Flags Display at Eiffel Tower:  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర అభిమాన ఎల్లలు దాటింది. తెలుగు గడ్డపైన మాత్రమే కాకుండా.. యువగళం, తెలుగుదేశంపై అభిమానాన్ని తెలుగు తమ్ముళ్లు విదేశాల్లో ప్రదర్శిస్తున్నారు. ఫ్రాన్స్​లోని ప్రముఖ పట్టణమైన పారిస్ ఐఫిల్​ టవర్​ ప్రాంగణంలో యువగళం, టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. అయితే ఇటీవల ఇంగ్లడ్​లో స్థిరపడిన ఏపీకి చెందిన ప్రముఖ వైద్యులు ఏలూరులో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేశ్​కు మద్దతు తెలిపారు. ఇలా దేశ విదేశాల్లో యువగళం అభిమానులను సొంతం చేసుకుంటోంది. 

ఈ సంవత్సరం జనవరి 27 ప్రారంభమైన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. పాదయాత్ర ప్రారంభమైన 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. పారిస్​లోని ఐఫిల్​ టవర్​ వద్ద వినోద్ యువగళం జెండాతోపాటు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి అభిమానాన్ని చాటుకున్నారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని ఆయన కోరుకున్నారు. మంగళగిరి నియోజవర్గానికి చెందిన వినోద్​.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తూ.. ఐఫిల్​ టవర్​ వద్ద యువగళం జెండాను ప్రదర్శించినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.