Young Man Injured in Ganesh Idol Immersion యువకుల్లారా.. వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో ఇలాంటి విన్యాసాలకు దూరంగా ఉండండి! - తలకు గాయమై అచేతనంగా పడిపోయిన యువకుడు
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 8:08 PM IST
Young Man Injured in Ganesh Idol Immersion: అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పట్టణంలోని జీప్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు గత ఐదు రోజుల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ రోజు మధ్యాహ్నం గణేష్ నిమజ్జనానికి కాలనీవాసులు సిద్ధమయ్యారు. వినాయకుని విగ్రహాన్ని ట్రాక్టర్లో తీసుకుని కోలాహలంగా అంతా ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో వినాయుకుని వెంట.. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ రంగులను చల్లుకుంటూ డాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారు. అయితే విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో సాయినగర్‌కు చెందిన కిరణ్ అనే యువకుడు ట్రాక్టర్ బంపర్ పైనుంచి పల్టీ కొట్టడంతో తలకు బలమైన గాయమై.. అతడు అచేతనంగా పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స మేరకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడికి చలనం రాకపోవటంతో.. మెరుగైన చికిత్స మేరకు తిరుపతి ఆస్పత్రికి తరలించారు.