తగ్గేదేలే.. చీరకట్టులో ఫుట్​బాల్ ఆడిన మహిళలు - చీరకట్టులో సాకర్​ ఆడిన మహిళలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 27, 2023, 11:48 AM IST

ఫుట్​బాల్​.. చీరకట్టులో ఆడే ఆట కాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి వారి ఆలోచనల్ని పటాపంచలు చేశారు కొందరు మహిళలు. చీరకట్టులో ఫుట్​బాల్​ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాలితో బంతిని అలవోకగా తన్ని.. ఏ వస్త్రధారణలోనైనా ఫుట్​బాల్ ఆడవచ్చని నిరూపించారు. గోల్​ కొట్టేందుకు చకచక పరుగులు తీస్తూ.. అదరగొట్టారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. బంతిని గోల్​ దిశగా పరుగెత్తించారు. ఈ అరుదైన ఘటనకు మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ వేదికైంది. నగరంలోని ఎమ్​ఎల్​బీ గ్రౌండ్​లో స్థానికులు 'గోల్ ఇన్​ శారీ' అనే టోర్నమెంట్​ను నిర్వహించారు. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. అయితే, ఇందులో పాల్గొన్న వారు 25 నుంచి 50 ఏళ్ల వయసువారే. రెండు రోజులు జరిగే ఈ టోర్నమెంట్​లో.. మొదటి రోజు పింక్​, నీలం, కాషాయ రంగు జట్లు పాల్గొన్నాయి. ఇందులో పింక్​ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీని నిర్వహించిన కన్వీనర్​ అంజలి బాత్రా మాట్లాడుతూ.. మహిళలు చీరకట్టులో ఫుట్​బాల్​ ఆడటం చూసి ప్రేక్షకులు థ్రిల్లింగ్​గా ఫీల్​ అయ్యారని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.