Sankranthiki Vasthunam Extra Shows : విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక వీకెండ్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
సంక్రాంతి సెలవులు కావడం వల్ల థియేటర్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. టికెట్లు దొరకక థియేటర్ నుంచి తిరిగి వెళ్లిపోతున్న ప్రేక్షకులూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించాలని నిర్ణయించినట్లు మేకర్స్ పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులకుతోడు వీకెండ్ కూడా కలిసి రావడం వల్ల మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
The festive season is not over yet 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) January 16, 2025
On huge public demand from the audiences, Over 220+ Extra Shows added in AP& TS for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥
Book tickets now!
— https://t.co/ocLq3HYNtH#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶
Victory @venkymama @anilravipudi… pic.twitter.com/PrTL4zNM8a
గేమ్‌ఛేంజర్ షోస్ తగ్గింపు!
జనవరి 10న రిలీజైన 'గేమ్‌ఛేంజర్' సినిమా షోలను తగ్గించి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు ఎక్స్ట్రా షోలు అడ్జెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు నిర్మాత దిల్‌రాజు ఒక్కరే కావడం వల్ల స్క్రీన్‌లు పెంచే విషయంలో పెద్దగా సమస్యలు ఎదురు కాలేదని తెలుస్తోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో తెరకెక్కించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వి రాజ్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు.
The ‘VICTORY RAMPAGE’ continues at the box office 🔥🔥🔥
— Sri Venkateswara Creations (@SVC_official) January 16, 2025
77CRORE+ Worldwide Gross in 2 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥
And Day3 already begun on a sensational note 💥💥#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶
Victory @venkymama @anilravipudi @aishu_dil… pic.twitter.com/OmbWYW2oqp